చేగుంటలో మంత్రి వివేక్ వెంకటస్వామికి స్వాగతం-ఆహ్వానించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి
చేగుంట నవజ్యోతి ప్రతినిధి ముకుంద్:
చేగుంట:తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబ్బాక నియోజకవర్గానికి విచ్చేస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కి చేగుంట పట్టణంలో ఘన స్వాగతం లభించింది.దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంత్రికి పూలమాలలు వేసి ఘనంగా ఆహ్వానం పలికారు. మంత్రి రాకతో చేగుంట పట్టణంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.ఈ కార్యక్రమంలో చేగుంట మండల ప్రెసిడెంట్ కాశబోయిన భాస్కర్, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ సోలిపేట ప్రసాద్ రెడ్డి, జూకంటి రాజా గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలాపురం కనకయ్య యాదవ్, వడియారం గ్రామ సర్పంచ్ అంకన్న గారి సాయికుమార్ గౌడ్, చేగుంట యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, నలిన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






