Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నల్గొండ

కూచిపూడి నృత్య పోటీల్లో శ్రీపాద సిరి వెన్నెలకు ప్రథమ బహుమతి

November 15, 2026 · 2 weeks క్రితం
◉ 5 Views ↗ 0 Shares

మిర్యాలగూడ, నవంబర్ 15 (నవజ్యోతి ప్రతినిధి) బాలల దినోత్సవం సందర్భంగా గుంటూరులో నిర్వహించిన రెండు తెలుగు రాష్ట్రా స్థాయి కూచిపూడి నృత్య పోటీల్లో, మిర్యాలగూడకు చెందిన శ్రీపాద సిరి వెన్నెల సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించింది. మంజీరా ఆర్ట్స్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో, అన్నమయ్య కళావేదికలో నిర్వహించిన పోటీల్లో ఆమెకు ప్రథమ బహుమతితో పాటు బాల కళారత్న అవార్డును ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. మిర్యాలగూడలోని సిరిమువ్వ నాట్యాలయంలో నాట్యగురువు కలకొండ రాము వద్ద శిక్షణ పొందుతున్న సిరి వెన్నెల 2020 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, నల్గొండ తదితర ప్రాంతాల్లో పలు బహుమతులు సాధించింది. పేరిని, కూచిపూడి, భరతనాట్యంలో ఆరేళ్లుగా శిక్షణ పొందుతూ చదువులోనూ రాణిస్తోందని నాట్యగురువు తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరిన్ని అవార్డులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram