Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నల్గొండ

చేయూత పింఛన్లతో పేదలకు ఆర్థిక భరోసా..

November 13, 2026 · 2 weeks క్రితం
◉ 11 Views ↗ 0 Shares

మాడుగులపల్లి, నవంబర్ 13 (నవజ్యోతి ప్రతినిధి) పేద, బలహీన వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోందని మాడుగులపల్లి గ్రామ సర్పంచ్ అర్రూరి నరేష్ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాడుగులపల్లి సర్పంచ్ అర్రూరి నరేష్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి వంశీధర్‌ లతో కలిసి మాడుగులపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులకు చేయూత పింఛన్లు అందించడం ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా నిరుపేదల కష్టాలను గుర్తించి, వారి సంక్షేమం కోసం ప్రత్యేక చొరవ చూపుతున్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రవణ్ కుమార్, లబ్ధిదారులు బద్రమ్మ, శంకర్, షఫీ, రుత్విక్, విజయ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram