Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
హైదరాబాద్

5జీ, డ్రోన్ టెక్నాలజీలపై గీతం విశ్వవిద్యాలయంలో కార్యశాల

November 11, 2026 · 2 weeks క్రితం
◉ 7 Views ↗ 0 Shares

హైదరాబాద్, నవంబర్ 11 (నవజ్యోతి ప్రతినిధి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు అవగాహన కల్పించేందుకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మూడు రోజుల హైబ్రిడ్ కార్యశాలను నిర్వహించింది. నవంబర్ 9 నుంచి 11 వరకు స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో సీఎస్‌అండ్‌ఎస్ఈ, ఏఐ అండ్ డీఎస్ విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ప్రధానంగా 5జీ కమ్యూనికేషన్, డ్రోన్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, ఎడ్జ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలపై నిపుణులు అవగాహన కల్పించారు. డ్రోన్ వ్యవస్థల నిర్మాణం, కమ్యూనికేషన్ విధానాలు, ఏఐ ఆధారిత ఆబ్జెక్ట్ డిటెక్షన్, అటానమస్ నావిగేషన్, మిషన్ ప్లానింగ్ అంశాలను వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరణలో వినియోగించే విధానాలపై ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. స్మార్ట్ వ్యవసాయం, స్మార్ట్ నగరాల అభివృద్ధి, విపత్తు నిర్వహణలో డ్రోన్ల వినియోగం గురించి చర్చించారు. పరిశోధన, నూతన ఆవిష్కరణలు, అంతర్ విభాగ ప్రాజెక్టుల అవకాశాలపై మార్గదర్శనం చేశారు. ఈ కార్యశాలలో ఐఐటీడీఎం కర్నూలుకు చెందిన డాక్టర్ ఎం.రవికుమార్, డాక్టర్ పి.కిషోర్, డాక్టర్ కె.కృష్ణ నాయక్, ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన డాక్టర్ కె.జగదీష్, అహ్మదాబాద్‌కు చెందిన డాక్టర్ అజిత్ కుమార్ పాల్గొన్నారు. బెంగళూరు ఐఐఎస్సీ ఆర్ట్‌పార్క్‌కు చెందిన డాక్టర్ రవిరాజ్ సక్సేనా, చండీగఢ్‌కు చెందిన డాక్టర్ సిమ్రన్‌జిత్ సింగ్, గీతం అధ్యాపకులు డాక్టర్ ఎన్‌వీఆర్ స్వరూప్ కుమార్, డాక్టర్ కె.వెంకటేశ్వరరావు సాంకేతిక అంశాలను వివరించారు. మూడు రోజులపాటు జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో ఉపాధి, పరిశోధన అవకాశాలను తెలుసుకున్నారు. ప్రయోగాత్మక శిక్షణ ద్వారా నైపుణ్యాలను మెరుగుపరచుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యశాల నిర్వహించిన గీతం యాజమాన్యానికి పాల్గొన్నవారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram