Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

సీఎం సిద్దిపేట సభ ఏర్పాట్లు ముమ్మరం- సభ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు కలెక్టర్

November 10, 2026 · 3 weeks క్రితం
◉ 12 Views ↗ 0 Shares

దుబ్బాక:సిద్దిపేట పట్టణంలో ఈ నెల నవంబర్ 19న ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు, అధికారులు పరిశీలించారు.సభా స్థలాన్ని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి కలిసి పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, వేదిక ఏర్పాటు, పార్కింగ్, తాగునీరు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సిద్దిపేట గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ చారిత్రాత్మకంగా నిలుస్తుందని, లక్షలాది మందితో సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ నవంబర్ 19న జరిగే సభలో ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లాకు పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలిపారు.దుబ్బాక ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ పరిశీలనలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram