మిర్యాలగూడను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి
మిర్యాలగూడ, నవంబర్ 9 (నవజ్యోతి ప్రతినిధి) మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ, జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆర్డీఓ రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి బాలకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. పరిశ్రమలు, సిమెంట్ కర్మాగారాలు, బియ్యం మిల్లులు, సహజ వనరులు కలిగిన మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు అన్ని విధాలా అర్హత కలిగి ఉందని నాయకులు పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటుతో వైద్య, ఇంజినీరింగ్, ఔషధ విద్యా కళాశాలలు ఏర్పడి విద్యార్థులకు ఉన్నత విద్య, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి స్పందించి మిర్యాలగూడను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి కన్వీనర్ సయ్యద్ ఫరూక్, బంటు వెంకటేశ్వర్లు, వజ్రగిరి అంజయ్య, ఎర్రబల్లి దుర్గయ్య, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






