Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నల్గొండ

రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి

November 7, 2026 · 3 weeks క్రితం
◉ 5 Views ↗ 0 Shares

మిర్యాలగూడ, నవంబర్ 7 (నవజ్యోతి ప్రతినిధి) మిర్యాలగూడ పరిధిలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, మిల్లర్ల అక్రమ కుమ్మక్కు వ్యవహారాలను అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ), ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో, శనివారం రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా, ముందుగా స్థానిక రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇలాంటి అక్రమ విధానాలకు అడ్డుకట్ట వేసి రైతులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. రైతుల ధాన్యానికి సరైన ధర కల్పించి, కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకుడు తరి ఎల్లయ్య మహారాజ్, జేఏసీ జిల్లా నాయకులు నీలకంఠం నాయక్, వజ్జగిరి అంజయ్య, కిషన్ నాయక్, డీఎస్పీ నాయకులు రాజశేఖర్, వెంకటేష్, శివన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram