Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
హైదరాబాద్

హైదరాబాద్‌ హోటల్‌లో అమెరికా వ్యాపారవేత్త మృతి!

November 7, 2026 · 3 weeks క్రితం
◉ 8 Views ↗ 0 Shares

హైదరాబాద్‌, నవంబర్‌ 7 (నవజ్యోతి ప్రతినిధి): గచ్చిబౌలిలోని మారియట్‌ ఎగ్జిక్యూటివ్‌ అపార్ట్‌మెంట్స్‌ హోటల్‌లో అమెరికాకు చెందిన 41 ఏళ్ల మైఖేల్‌ బ్రయాన్‌ లీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాలిఫోర్నియాకు చెందిన ఆయన వ్యాపార పనుల నిమిత్తం నవంబర్‌ 2న తన వ్యాపార భాగస్వామి డేవిడ్‌ వూతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి హోటల్‌లో బస చేశారు. నవంబర్‌ 4 సాయంత్రం నుంచి లీ ఫోన్‌ కాల్స్‌కు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్‌ సిబ్బంది నవంబర్‌ 5న సాయంత్రం 6.30 గంటల సమయంలో 12వ అంతస్తులోని 1218 గది తలుపులు తెరిచి చూడగా, మంచంపై అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే 108కు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తు ఆధారంగా మరణానికి కారణాన్ని నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram