Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
ప్రత్యేక కథనాలు

నవజ్యోతి ఎఫెక్ట్‌.. కల్వర్టుకు రక్షణ! కథనం కదిలించింది.. అధికారులు స్పందించారు..

ప్రమాదం చెప్పేలోపే.. నవజ్యోతి గళం వినిపించింది...
SAI MANIKANTA
September 28, 2026 · 1 day క్రితం
◉ 84 Views ↗ 2 Shares

కుత్బుల్లాపూర్, సెప్టెంబర్‌ 28 (నవజ్యోతి ప్రతినిధి):

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే కాదు.. వాటికి పరిష్కారం లభించేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలోనూ నవజ్యోతి తన బాధ్యతను కొనసాగిస్తోంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడ నుంచి దూలపల్లి వెళ్లే మార్గంలోని నరేంద్ర స్టీల్స్ ఫేజ్‌–1, ప్లాట్ నంబర్‌ 18/1 సమీపంలోని కల్వర్టు వద్ద రక్షణ గోడ లేక వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘కల్వర్టుకు రక్షణేదీ?.. అధికారుల పర్యవేక్షణేదీ?’ శీర్షికన నవజ్యోతిలో కథనం ప్రచురితమైంది.

కల్వర్టు వద్ద రక్షణ లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. పారిశ్రామిక ప్రాంతం కావడంతో నిత్యం భారీ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో రక్షణ చర్యలు లేకపోవడం ప్రమాదకర పరిస్థితికి దారితీసే అవకాశం ఉందని నవజ్యోతి కథనం ద్వారా ఐలా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

కథనం ఫలించింది.. రక్షణ గోడ వచ్చింది!
నవజ్యోతి కథనంపై స్పందించిన జీడిమెట్ల ఐలా అధికారులు కల్వర్టు వద్ద రక్షణ గోడను ఏర్పాటు చేశారు.

నవజ్యోతి కథనంపై స్పందించిన జీడిమెట్ల ఐలా అధికారులు కల్వర్టు వద్ద రక్షణ గోడను ఏర్పాటు చేశారు. దీంతో ఇన్నాళ్లు రక్షణ చర్యలు లేక ప్రమాదకరంగా ఉన్న ప్రాంతంలో భద్రతా చర్యలు చేపట్టినట్లయింది. వాహనదారులకు ప్రమాద ముప్పు తగ్గేలా రక్షణ గోడ ఏర్పాటు చేయడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించడం ఒక దశ అయితే.. దానికి పరిష్కారం లభించే వరకు విషయాన్ని ముందుకు తీసుకెళ్లడం మరో బాధ్యత. నవజ్యోతి ప్రచురించిన కథనం అధికార యంత్రాంగం దృష్టిని ఆకర్షించి, కల్వర్టుకు రక్షణ గోడ ఏర్పాటుకు దారితీయడం ప్రజా సమస్యలపై పత్రిక చొరవకు నిదర్శనంగా నిలిచింది.

ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో నవజ్యోతి తన బాధ్యతను కొనసాగిస్తోంది. సమస్యను గుర్తించి.. అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కారం జరిగే వరకు ప్రజల తరఫున ప్రశ్నించడం నవజ్యోతి జర్నలిజం లక్ష్యం. కల్వర్టుకు రక్షణ గోడ ఏర్పాటు కావడం ‘నవజ్యోతి ఎఫెక్ట్‌’కు మరో ఉదాహరణగా నిలిచింది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram