Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
బ్రేకింగ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ : వినాయక నిమజ్జనంలో విషాదం

శిరీష చారిటబుల్ ట్రస్ట్
SAI MANIKANTA
September 16, 2026 · 5 days క్రితం
12 Views 0 Shares

నేరేడు చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థుల దుర్మరణం

పటాన్‌చెరువు, సెప్టెంబర్ 16 (నవజ్యోతి ప్రతినిధి):

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం కోసం నేరేడుచెరువులోకి దిగిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. మృతులంతా శివనగర్ చౌరస్తా – పెద్దకంజెర్లలోని శిరీష చారిటబుల్ ట్రస్ట్కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు.

శిరీష చారిటబుల్ ట్రస్ట్
శివనగర్ చౌరస్తా – పెద్దకంజెర్లలో శిరీష చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ట్రస్ట్‌లో ప్రస్తుతం సుమారు 70 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకటో తరగతి నుంచి పాలిటెక్నిక్ – బి.టెక్ వరకు విద్యను అందిస్తున్నట్లు సమాచారం. తల్లిదండ్రులు లేని విద్యార్థులను మాత్రమే ట్రస్ట్‌లో చేర్చుకుంటున్నట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణంరాజు అనే వ్యక్తి తన కుమార్తె శిరీష పేరుతో ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

మృతి చెందిన విద్యార్థులు
నర్సింహ రాజు
సుమంత్ — డిప్లొమా రెండో సంవత్సరం
గణేష్ — డిప్లొమా రెండో సంవత్సరం
ఉదయ్ కిరణ్ — డిప్లొమా మూడో సంవత్సరం
శ్యామ్ కుమార్ — డిప్లొమా మొదటి సంవత్సరం
సిద్దార్థ్ — పదో తరగతి

విద్యార్థుల మృతిపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి
విద్యార్థుల మృతి పట్ల పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాచీన గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల మృతదేహాలకు నివాళులర్పించారు. ఒకేసారి ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం పట్ల ఆయన తీవ్రంగా కలత చెందారు.

పోస్టుమార్టం – మృతదేహాల తరలింపుపై ఆదేశాలు
గురువారం ఉదయం 10 గంటలలోపు పోస్టుమార్టం పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అనంతరం మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు అంబులెన్సుల్లో తరలించాలని సూచించారు. ఇందుకోసం తన సొంత నిధులతో అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

ఈ ఘటనతో పెద్దకంజెర్ల ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యార్థుల మృతితో శిరీష చారిటబుల్ ట్రస్ట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలు – బంధువుల రోదనలతో ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం నెలకొంది.