శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి కి ప్రత్యేక పూజలు చేసిన దండే అపర్ణ
వెల్దుర్తి నవజ్యోతి ప్రతినిధి ముకుంద్:
వెల్దుర్తి: వెల్దుర్తి మండలం బస్వాపురం గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దండె అపర్ణ పర్యటించారు. సోమవారం గ్రామానికి విచ్చేసిన ఆమెకు గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.తన పర్యటన కార్యక్రమంలో భాగంగా ఆమె గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి మరియు శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థాన క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, అర్చన చేసి మొక్కులు తీర్చుకున్నారు.ఆలయానికి విచ్చేసిన దండె అపర్ణకు స్థానిక నాయకులు, ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, p పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మల్లికార్జున స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






