Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మేడ్చల్ మల్కాజిగిరి

మౌలాలి టీవీఎస్ తులసీలో సర్వీసింగ్ కష్టాలు…! వాహనాలను రోజుల తరబడి షోరూంలోనే ఉంచుతున్నారని వినియోగదారుల ఆవేదన

November 27, 2026 · 1 day క్రితం
◉ 8 Views ↗ 0 Shares

మౌలాలి, నవంబర్ 26, (నవజ్యోతి ప్రతినిధి) :
మౌలాలిలోని టీవీఎస్ తులసీ షోరూంలో ద్విచక్ర వాహనాల సర్వీసింగ్ కోసం వస్తున్న వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీవీఎస్ బ్యాటరీతో నడిచే విద్యుత్ ద్విచక్ర వాహనాల సర్వీసింగ్ విషయంలో షోరూం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వాహనాలను సర్వీసింగ్ కోసం షోరూంకు తీసుకెళ్తే వెంటనే మరమ్మతులు పూర్తి చేసి అందించాల్సింది పోయి, రెండు మూడు రోజుల పాటు షోరూంలోనే ఉంచుకుంటున్నారని వాపోతున్నారు. సిబ్బంది కొరత కారణంగా నిర్ణీత సమయంలో సర్వీసింగ్ పూర్తి చేయలేకపోతున్నారని, దీంతో నిత్యం తమ వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల కోసం వాహనాలపై ఆధారపడే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. .లక్షల రూపాయలు వెచ్చించి ఆధునిక సాంకేతికతతో కూడిన విద్యుత్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసినప్పటికీ, వాటికి సరైన సమయంలో సర్వీసింగ్ అందకపోవడం వల్ల కొనుగోలు చేసిన ప్రయోజనం లేకుండా పోతోందని వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల నిర్వహణ, మరమ్మతుల విషయంలో సరైన సిబ్బందిని అందుబాటులో ఉంచకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపిస్తున్నారు.
వాహనాల విక్రయాలపై చూపుతున్న శ్రద్ధను విక్రయానంతర సేవలపై కూడా చూపించాలని వినియోగదారులు సూచిస్తున్నారు. సర్వీసింగ్ కోసం వచ్చిన వాహనాలను రోజుల తరబడి నిలిపివేయకుండా, అవసరమైన సాంకేతిక నిపుణులు, సిబ్బందిని నియమించి సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా టీవీఎస్ తులసీ షోరూం యాజమాన్యం స్పందించి సర్వీసింగ్ విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram