ప్రజలే కుటుంబం.. ప్రజా సేవే ధ్యేయం.. అభివృద్ధే లక్ష్యం!
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మూడేళ్ల ప్రజా ప్రస్థానంపై ప్రత్యేక పుస్తక ఆవిష్కరణ
ఎమ్మెల్యే జన్మదిన వేడుకల సందర్భంగా పీఏ ఆలేటి రమేష్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
కుషాయిగూడ :
ప్రజా సేవలో సాగిన ప్రస్థానానికి అక్షర రూపం.. అభివృద్ధి కార్యక్రమాలకు దర్పణంగా ప్రత్యేక పుస్తకం రూపుదిద్దుకుంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆయన మూడేళ్ల ప్రజా ప్రస్థానం, ప్రజాసేవ, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఆయన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) ఆలేటి రమేష్ రచించిన “ప్రజలే కుటుంబం – ప్రజా సేవే ధ్యేయం – అభివృద్ధే లక్ష్యం” అనే ప్రత్యేక పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉప్పల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బండారి లక్ష్మారెడ్డి సాగించిన ప్రయాణం, ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన కృషి, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా ముందుకు సాగిన తీరును అక్షరబద్ధం చేశారు.ప్రజలనే తన కుటుంబంగా భావిస్తూ, ప్రజాసేవనే ధ్యేయంగా, నియోజకవర్గ అభివృద్ధినే లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఎమ్మెల్యే మూడు సంవత్సరాల ప్రజా ప్రస్థానాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రచించినట్లు ఆలేటి రమేష్ తెలిపారు.ఎమ్మెల్యే రాజకీయ ప్రస్థానంతో పాటు ప్రజలతో ఆయనకున్న అనుబంధం, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత, అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను పుస్తక రూపంలో అందించడం ప్రత్యేకతగా నిలిచింది. జన్మదిన వేడుకల సందర్భంగా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం విశేషంగా మారింది.






