ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ఇద్దరికి రూ.74 వేల ఆర్థిక సాయం
భూదాన్ పోచంపల్లి నవంబర్ 25(నవ జ్యోతి ప్రతినిధి):
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పునూతల వెంకటేష్ యాదవ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బర్ల మల్లయ్యకు రూ.42 వేలు, వారాల యాదమ్మకు రూ.32 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ.74 వేల ఆర్థిక సాయం అందించారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొక్క మల్లారెడ్డి, ఉపసర్పంచ్ సంతోష్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు మేకల రామకృష్ణారెడ్డి, వారాల రామచంద్రారెడ్డి, సరసాని వెంకట్ రెడ్డి, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు నారి మహేష్, చిలుకల శివకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






