అచ్చంపేట పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
◉ 5 Views
↗ 0 Shares
నిజాంసాగర్, నవంబర్ 26 (మన న్యూస్): నిజాంసాగర్ మండలం అచ్చంపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివకృష్ణ, గ్రామ సర్పంచ్ ఎస్. లక్ష్మయ్య, ఎంఈఓ వై. తిరుపతిరెడ్డి పాల్గొని విద్యార్థులకు రాజ్యాంగంలోని హక్కులు, విధులు, ప్రజాస్వామ్య విలువలను వివరించారు.
అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు అచ్చంపేట గ్రామానికి చెందిన దాత తపేట్ల సైమన్ బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు జోసెఫ్ రత్నకాంత్, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి తుకారాం, జీపీఓ సంగమేశ్వర్ రెడ్డి, సీఆర్పీ వరలక్ష్మి, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి






