కాలనీల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి
◉ 0 Views
↗ 0 Shares
కుత్బుల్లాపూర్, నవంబర్ 28 (నవజ్యోతి ప్రతినిధి): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెబుతున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు, అయ్యప్ప స్వాములు శంభీపూర్లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు పలు శుభకార్యాలు, అయ్యప్ప స్వాముల పూజా కార్యక్రమాలకు హాజరుకావాలని పలువురు ఆయనను ఆహ్వానించారు.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి






