Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
యాదాద్రి భువనగిరి

మృతుడి కుటుంబానికి ఎమ్మార్పీఎస్ నాయకుల పరామర్శ.. 25 కిలోల బియ్యం అందజేత

November 27, 2026 · 1 day క్రితం
◉ 8 Views ↗ 0 Shares

. భూదాన్ పోచంపల్లి: పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన పోతగళ్ల బాలరాజు తండ్రి బసవయ్య ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో బసవయ్య దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన ఎమ్మార్పీఎస్ నాయకులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు.
ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు పోతగళ్ల శ్రీనివాస్, కార్యదర్శి పోతగళ్ల నరసింహ ఆధ్వర్యంలో భోగి అయ్యప్ప 25 కిలోల బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న వారికి తమ వంతు సహకారం అందించడం ద్వారా అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి అవసరమైన సమయంలో తోడ్పాటు అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చెరుకు నరసింహ, కరగల్ల కుమార్, పోతగళ్ల దానయ్య, కుక్క కుమార్, పోతగళ్ల యాదగిరి, పోతగళ్ల శ్రీనివాస్, పోతగళ్ల నరసింహ, ఓరుగంటి శ్రీను, మూటపురం రవి, కృష్ణ, నరసింహ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram