Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
యాదాద్రి భువనగిరి

ఎమ్మెల్యే కుటుంబం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఐదు లక్షల ఎల్ఓసి అందజేత

November 25, 2026 · 3 days క్రితం
◉ 11 Views ↗ 0 Shares

భూదాన్ పోచంపల్లి, నవంబర్ 25(నవ జ్యోతి ప్రతినిధి)

పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చికిత్స పొందేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కందాల నవీన్‌కు వైద్య చికిత్స నిమిత్తం రూ.5 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ఎల్‌ఓసీని బుధవారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందన్నారు. అర్హులైన బాధితులకు సకాలంలో ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram