Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
యాదాద్రి భువనగిరి

మాజీ సర్పంచ్ యముజాల చంద్రయ్య కుటుంబానికి రూ.5 వేల తక్షణ ఆర్థిక సహాయం అందజేత.

November 25, 2026 · 3 days క్రితం
◉ 2 Views ↗ 0 Shares

భూదాన్ పోచంపల్లి,, నవంబర్ 25(నవ జ్యోతి ప్రతినిధి): మెహర్ నగర్ గ్రామ మాజీ సర్పంచ్ యంజాల చంద్రయ్య ఈరోజు స్వర్గస్తులైనారు. ఆయన మృతి పట్ల గ్రామ సర్పంచ్ సిలువేరు లక్ష్మయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా సిలివేరు కృష్ణమ్మ, వెంకయ్యల స్మారకార్థం వారి కుమారుడు, గ్రామ సర్పంచ్ సిలివేరు లక్ష్మయ్య మానవతా దృక్పథంతో ముందుకొచ్చి చంద్రయ్య కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5,000 అందజేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు.
మాజీ సర్పంచ్ చంద్రయ్య మృతి గ్రామానికి తీరని లోటని పలువురు గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొని మృతుడికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram