Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
యాదాద్రి భువనగిరి

ప్రజావాణికి రెండు వినతులు ప్రజల నుంచి అర్జీల స్వీకరణ..

November 23, 2026 · 5 days క్రితం
◉ 3 Views ↗ 0 Shares

– త్వరితగతిన పరిష్కారానికి చర్యలు: ఎంపీడీవో విజయ

భూదాన్ పోచంపల్లి, నవంబర్ 23(నవ జ్యోతి ప్రతినిధి): భూదాన్ పోచంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఎంపీడీవో విజయ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల స్థాయి వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి మొత్తం రెండు వినతిపత్రాలు అందినట్లు ఎంపీడీవో విజయ తెలిపారు. వీటిలో ఎంపీడీవో కార్యాలయానికి సంబంధించి ఒక అర్జీ, గృహ నిర్మాణ శాఖ ఏఈ (హౌసింగ్)కి సంబంధించి మరో అర్జీ అందినట్లు పేర్కొన్నారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమం చక్కని వేదికగా ఉపయోగపడుతుందని, ఈ కార్యక్రమంలో అందిన వినతులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందిన ప్రతి అర్జీపై తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో విజయ సూచించారు. ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram