Wednesday, September 30, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
కామారెడ్డి

భిక్కనూర్‌ తహశీల్దార్‌కు భాగిర్తిపల్లి గ్రామస్థుల వినతి

ఇస్సన్నపల్లి పెద్దచెరువును భాగిర్తిపల్లి కొచ్చెరువుగా రికార్డుల్లో మార్చాలని విజ్ఞప్తి !
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
September 30, 2026 · 25 seconds క్రితం
◉ 1 Views ↗ 1 Shares

భిక్కనూర్‌, సెప్టెంబర్‌ 30 (నవజ్యోతి ప్రతినిధి):
భాగిర్తిపల్లి గ్రామ పరిధిలోని కొచ్చెరువు (ఇస్సన్నపల్లి పెద్దచెరువు) పేరును రికార్డుల్లో భాగిర్తిపల్లి కొచ్చెరువుగా మార్చి, ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్థులు భిక్కనూర్‌ తహశీల్దార్‌ సునీతకు వినతిపత్రం సమర్పించారు. చెరువులోని శిఖం, పట్టా భూములు, చెరువు కట్ట తదితర ప్రాంతాలు భాగిర్తిపల్లి గ్రామ పరిధిలోనే ఉన్నాయని వారు తెలిపారు.

మరోసారి అధికారికంగా సర్వే చేయాలని వినతి

గతంలో ఇరువురు గ్రామాల ప్రజల సమక్షంలో సర్వే నిర్వహించి హద్దులు చూపించారని గ్రామస్థులు తెలిపారు. అందుకు సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. మరోసారి అధికారికంగా సర్వే నిర్వహించి హద్దులను నిర్ధారించి, ప్రస్తుతం ఇస్సన్నపల్లి పెద్దచెరువు పేరుతో ఉన్న చెరువును భాగిర్తిపల్లి కొచ్చెరువుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు.

40 ఏళ్లుగా పన్ను చెల్లిస్తున్నామన్న గ్రామస్థులు

ఈ చెరువుకు సంబంధించిన భూమి శిస్తు (గారక పన్ను)ను గత 40 సంవత్సరాలుగా భాగిర్తిపల్లి మత్స్య సహకార సంఘం చెల్లిస్తోందని గ్రామస్థులు తెలిపారు. తాతలు, ముత్తాతల కాలం నుంచి కొనసాగుతున్న సమస్యకు అధికారులు చొరవ తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సింలు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram