Wednesday, September 30, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జనరల్

ఇర్ఫాని దర్గా ఉర్సుకు ఘనంగా ఏర్పాట్లు

అక్టోబర్ 1, 2 తేదీల్లో 24వ ఉర్సు ఉత్సవాలు.. గంధం ఊరేగింపు, కవి సమ్మేళనం, ఖవ్వాలి ప్రత్యేక ఆకర్షణ
LAXMAN
September 30, 2026 · 10 hours క్రితం
◉ 8 Views ↗ 2 Shares

సంగారెడ్డి, సెప్టెంబర్ 29 (నవజ్యోతి ప్రతినిధి): సంగారెడ్డి శివారులోని ఇర్ఫాని దర్గా 24వ ఉర్సు ఉత్సవాలను అక్టోబర్ 1, 2 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా పీఠాధిపతి ఉమర్ బీన్ అహ్మద్ తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అక్టోబర్ 1న సంప్రదాయబద్ధంగా గంధం ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అఖిల భారత కవి సమ్మేళనం జరుగుతుందని, ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ కవులు పాల్గొంటారని చెప్పారు. అక్టోబర్ 2న దీపారాధనతో పాటు ప్రత్యేక ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇర్ఫాని దర్గా ఉర్సు ఉత్సవాలకు సంగారెడ్డి పరిసర ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారని ఉమర్ బీన్ అహ్మద్ తెలిపారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram