ఆసియా క్రీడల్లో భారత్–పాక్ పోరు ఎప్పుడు?
నాగోయా (నవజ్యోతి దినపత్రిక) :
జపాన్‌లోని ఐచి–నగోయా వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ పోటీలు ఆసక్తి రేపుతున్నాయి. మొత్తం పది జట్లు పతకాల కోసం బరిలో నిలుస్తుండగా, భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన డ్రాలో చోటు దక్కించుకోగా, హాంకాంగ్, మలేషియా, నేపాల్, ఒమన్ క్వాలిఫికేషన్ ద్వారా అర్హత సాధించాయి. ఆతిథ్య జపాన్ కూడా బరిలో ఉంది.
ప్రస్తుత పోటీల ఫార్మాట్ ప్రకారం భారత్, పాకిస్థాన్ తమ తమ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తేనే తుదిపోరులో ఎదురుపడే అవకాశం ఉంటుంది. దీంతో రెండు జట్లు ఫైనల్ చేరితే క్రికెట్ అభిమానులకు హైఓల్టేజ్ పోరు కనువిందు చేయనుంది. అయితే ముందుగా నాకౌట్ దశలో రెండు జట్లు తమ ప్రత్యర్థులను అధిగమించాల్సి ఉంటుంది.






