టీ కప్పుతో ఆత్మీయ పలకరింపు.. నాయకులతో సరదా ముచ్చట్లు – ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
టీ కప్పుతో ఆత్మీయ పలకరింపు.. నాయకులతో సరదా ముచ్చట్లు – ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, నవంబర్ 25(నవ జ్యోతి ప్రతినిధి):
ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్య ఉండటం, వారి కష్టసుఖాలను తెలుసుకోవడం, ఆప్యాయంగా పలకరించడం కూడా ప్రజాసేవలో అంతర్భాగమేనని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన సరళమైన వ్యవహారశైలితో చాటిచెప్పారు. నిత్యం అధికారిక కార్యక్రమాలు, రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉండే ఆయన స్థానిక టీ స్టాల్ వద్ద నాయకులతో కలిసి కొంత సమయం సరదాగా గడిపారు. టీ కప్పు చేతబట్టి ఆప్యాయంగా పలకరిస్తూ, నవ్వులు పంచుకుంటూ వారితో ముచ్చటించారు.
ఈ సందర్భంగా రాజకీయాలు, రోజువారీ కార్యక్రమాలతో పాటు స్థానిక పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామాల అభివృద్ధి తదితర అంశాలపై నాయకులతో స్నేహపూర్వకంగా చర్చించారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సాధారణ వ్యక్తిలా అందరితో కలిసిపోయి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం అక్కడి వారిని ఆకట్టుకుంది.
ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎప్పుడూ పెద్ద సమావేశాలే అవసరం లేదని, కొన్నిసార్లు ఓ చిన్న పలకరింపు, ఓ కప్పు టీ, నాలుగు ఆత్మీయ మాటలు కూడా ప్రజల మనసుల్లోని భావాలను తెలుసుకునేందుకు మంచి వేదికలవుతాయని ఈ కలయిక తెలియజేసింది. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎంత చేరువగా ఉంటే వారి సమస్యలు అంత సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.
పదవులు, హోదాలు తాత్కాలికం.. ప్రజలతో ఉండే అనుబంధమే శాశ్వతం అన్న భావనకు ఈ సరదా కలయిక నిదర్శనంగా నిలిచింది. ప్రజల మధ్యకు వెళ్లి వారి కష్టసుఖాల్లో భాగస్వాములు కావడం, వారి సమస్యలను ఓపికగా వినడం, పరిష్కారానికి కృషి చేయడం వంటి లక్షణాలే నిజమైన ప్రజాసేవకు చిరునామాలని ఈ ఆత్మీయ టీ ముచ్చట్లు చాటిచెప్పాయి.






