Monday, November 2, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
తెలంగాణ

మానవ హక్కుల పరిరక్షణకు బిక్కనూరు యువకుడికి రాష్ట్రస్థాయి బాధ్యతలు!

నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఇండియా  ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ నియామకం.. బాధితులకు అండగా నిలుస్తానని వెల్లడి
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
November 2, 2026 · 3 hours క్రితం
◉ 119 Views ↗ 3 Shares

నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఇండియా  ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ నియామకం.. బాధితులకు అండగా నిలుస్తానని వెల్లడి

బిక్కనూరు
కామారెడ్డి జిల్లా
నవంబర్ 2

NHRACCCI FOUNDATION
శ్రీరామ్ వెంకటేష్
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

బిక్కనూర్, నవంబర్ 2 (నవజ్యోతి ప్రతినిధి): కామారెడ్డి జిల్లా బిక్కనూరుకు చెందిన శ్రీరామ్ వెంకటేష్‌కు రాష్ట్రస్థాయి బాధ్యతలు దక్కాయి.నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఇండియా ( NHRACCCI )ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. బిక్కనూరుకు చెందిన వ్యక్తికి రాష్ట్రస్థాయి సంస్థలో కీలక బాధ్యతలు లభించడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల పక్షాన నిలబడి, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మహిళలు, చిన్నారులు, పేదలు, బలహీన వర్గాలు సహా హక్కుల ఉల్లంఘనకు గురైన వారికి అండగా నిలవడం, ప్రజల్లో హక్కులపై అవగాహన కల్పించడం, సామాజిక బాధ్యతను పెంపొందించడం తన ప్రాధాన్యతలని పేర్కొన్నారు. పదవిని బాధ్యతగా భావించి ప్రజలకు అందుబాటులో ఉంటూ, సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు.

బాధితులకు అండగా నిలుస్తా!
ఎక్కడ అన్యాయం జరిగినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానని శ్రీరామ్ వెంకటేష్ స్పష్టం చేశారు.

నవజ్యోతి తెలుగు డైలీ
ప్రజల పక్షం.. ప్రజా సమస్యలపై నిరంతర కథనం

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram