భిక్కనూరు, సెప్టెంబర్ 22 (నవజ్యోతి ప్రతినిధి): భిక్కనూరు మండలం
రామేశ్వర్పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ – స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మజ సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాతను శాలువాతో సత్కరించి అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉప సర్పంచ్ వినోద్ గౌడ్, ఎంఈఓ రాజ్ గంగారెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటేశం, వీడీసీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, ఉమారాణి, పద్మ, శిరీష, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.