Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
కామారెడ్డి

భిక్కనూరులోనే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలి !

కలెక్టర్‌కు మండల నాయకుల వినతి... పాఠశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇప్పటికే చూపించినట్లు వెల్లడి
SAI MANIKANTA
September 23, 2026 · 6 days క్రితం
◉ 278 Views ↗ 4 Shares

భిక్కనూరు, సెప్టెంబర్‌ 22 (నవజ్యోతి ప్రతినిధి):

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ను భిక్కనూరు మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ భిక్కనూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పాఠశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని భిక్కనూరు గ్రామపంచాయతీ పరిధిలో ఇప్పటికే సంబంధిత అధికారులకు చూపించినట్లు తెలిపారు.

మండల కేంద్రంలో పాఠశాల ఏర్పాటు చేస్తే భిక్కనూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు సులభంగా అందుబాటులో ఉంటుందని గ్రామపంచాయతీ ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు ఆధునిక విద్యా వసతులను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ పాఠశాల కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు.

భిక్కనూరులోనే ఎందుకు?
మండలంలోని అనేక గ్రామాలకు భిక్కనూరు కేంద్రంగా ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు రాకపోకలు సులభంగా ఉంటాయని ప్రతినిధులు తెలిపారు. మండల కేంద్రంలో పాఠశాల ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువ గ్రామాల విద్యార్థులకు విద్యా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు ఆధునిక మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పాఠశాల నిర్మాణ ప్రక్రియను త్వరగా ప్రారంభించి ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో భిక్కనూరు సర్పంచ్‌ బల్యాల రేఖ సుదర్శన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, తిప్పాపూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుపారి భీమ్‌రెడ్డి, సర్పంచులు జ్యోతి సంతోష్‌గౌడ్‌, తుడుం పద్మ స్వామి, చేపూరి రాణి రాజు, అరుణ స్వామి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, రామేశ్వర్‌పల్లి ఉపసర్పంచ్‌ గొల్లపల్లి వినోద్‌గౌడ్‌, భిక్కనూరు గ్రామపంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram