Sunday, November 1, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
భక్తి

మహిషాసురమర్ధిని అలంకరణలో అమ్మవారు !

జండా గల్లీలో ప్రత్యేక పూజలు.. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 19, 2026 · 2 weeks క్రితం
◉ 34 Views ↗ 2 Shares
oplus_2

భిక్కనూరు, అక్టోబర్ 19 (నవజ్యోతి ప్రతినిధి): శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం భిక్కనూరు పట్టణంలోని జండా గల్లీ వద్ద భారత దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గమ్మను శ్రీ మహిషాసురమర్ధిని (సిద్ధిదాత్రి) దేవి రూపంలో విశేషంగా అలంకరించారు. పుష్పాలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, మంగళహారతులు సమర్పించారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, దుర్గమ్మ కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram