Sunday, November 1, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
భక్తి

జంగంపల్లిలో వైభవంగా దీపాలంకరణ సేవ!

భిక్కనూరు, అక్టోబర్‌ 17:
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 17, 2026 · 2 weeks క్రితం
◉ 37 Views ↗ 1 Shares
దీపాల వెలుగుల్లో దైవాకృతులు.. కనువిందు చేసిన ఆధ్యాత్మిక శోభ
భిక్కనూరు, అక్టోబర్‌ 17: (నవజ్యోతి ప్రతినిధి)

దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన దీపాలంకరణ సేవ భక్తులను ఆకట్టుకుంది. వందలాది దీపాలతో అమ్మవారి ఆకృతి, శివలింగం, విష్ణునామాలు, శంఖుచక్రాలు, ఓంకారం రూపాలను సుందరంగా తీర్చిదిద్దారు. దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వెలుగుల మధ్య దైవాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు.

దీపాల వెలుగుల్లో దైవాకృతులు

అమ్మవారి రూపంతో పాటు శివలింగం, విష్ణునామాలు, శంఖుచక్రాలు, ఓంకారాన్ని దీపాలతో రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భవాని మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

దీపాలంకరణతో గ్రామంలో భక్తిమయ వాతావరణం నెలకొంది. దేవీ నవరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ సేవ భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram