ఆరవ రోజు జ్ఞాన సరస్వతి రూపంలో అమ్మవారి దర్శనం!
ప్రత్యేక పూజలు.. భజనలు, భక్తి పాటలతో ఆధ్యాత్మిక శోభ
◉ 12 Views
↗ 3 Shares
బిక్కనూరు, అక్టోబర్ 16 (నవజ్యోతి ప్రతినిధి): బిక్కనూరు పట్టణంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భారత్ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని ఆరవ రోజు జ్ఞాన సరస్వతి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ తునికి వేణు దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తి పాటలు, భజనలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో భారత్ దుర్గా సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి






