Sunday, November 1, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
క్రైమ్

బౌరంపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడి మృతి - చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన సూపర్‌వైజర్‌
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 3, 2026 · 4 weeks క్రితం
◉ 576 Views ↗ 2 Shares
కుత్బుల్లాపూర్, అక్టోబర్‌ 3 (నవజ్యోతి ప్రతినిధి):

దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బౌరంపేట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సూపర్‌వైజర్‌ మృతి చెందాడు. శంభీపూర్‌కు చెందిన ఉదుతూరి వెంకట్‌రెడ్డి (38) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సుకృతి హోమ్స్‌ వద్ద ఢీకొన్న కారు
శుక్రవారం మధ్యాహ్నం శంభీపూర్‌ నుంచి బౌరంపేట్‌ వైపు వెంకట్‌రెడ్డి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. సుమారు 3.42 గంటల సమయంలో సుకృతి హోమ్స్‌ ఎదుటకు చేరుకోగానే బౌరంపేట్‌ వైపు నుంచి వచ్చిన కారు ఆయన బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వెంకట్‌రెడ్డికి తలకు తీవ్ర గాయంతో పాటు కుడికాలు, శరీరంలోని ఇతర భాగాల్లో గాయాలయ్యాయి. వెంటనే ఆయనను మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి 10.28 గంటలకు వెంకట్‌రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

కేసు నమోదు – దర్యాప్తు
మృతుడి భార్య పద్మజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణాలు, కారు డ్రైవర్‌ వివరాలు తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram