జంగంపల్లిలో భక్తి పారవశ్యం.. గల్లీ దుర్గమ్మకు ఘనంగా బోనాలు!
బిక్కనూరు, అక్టోబర్ 19 (నవజ్యోతి ప్రతినిధి):
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 19, 2026 · 2 weeks క్రితం
◉ 222 Views↗ 1 Shares
అమ్మవారి నామస్మరణతో మార్మోగిన గ్రామం.. భక్తితో బోనాలు సమర్పించి మొక్కులు
బిక్కనూరు, అక్టోబర్ 19 (నవజ్యోతి ప్రతినిధి):
జై దుర్గమ్మ.. జై జై దుర్గమ్మ నామస్మరణల మధ్య కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో గల్లీ దుర్గమ్మ బోనాల వేడుక భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. గ్రామంలో కొలువుదీరిన అమ్మవారికి భక్తులు భక్తిప్రపత్తులతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు జంగంపల్లితో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకుని దుర్గమ్మ ఆశీస్సులు కోరుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని, ఇంటిల్లిపాదీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లేలా కరుణించాలని అమ్మవారిని ప్రార్థించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారగా, గ్రామమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారిపై భక్తులకున్న అచంచల విశ్వాసం, భక్తిభావం ఈ వేడుకలో ప్రతిఫలించాయి. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని గల్లీ దుర్గమ్మకు బోనాలు సమర్పించి అమ్మవారి కృపాకటాక్షాల కోసం ప్రార్థించారు.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి