ఒక్క క్షణం నిర్లక్ష్యం.. అంతలోనే నిండు ప్రాణం గాలిలో కలిసింది. లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన బైక్ ప్రమాదానికి గురై ఓ వ్యక్తి లారీ కిందకు వెళ్లి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ప్రగతి నగర్‌లో కలకలం రేపింది. బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని త్రీ మంకీస్ చౌరస్తా సమీపంలో శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెనుక కూర్చున్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న బాచుపల్లి ఎస్‌హెచ్‌ఓ దాలినాయుడు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
ప్రమాదానికి కారణాలపై ప్రశ్నలు..
ఓవర్‌టేక్ సమయంలో బైక్ అదుపుతప్పడమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ.. ఆ ప్రాంతంలో సరైన వీధి దీపాలు లేకపోవడం, వాహనాల వేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం వంటి అంశాలు కూడా ప్రమాదానికి దోహదపడి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.
రాత్రివేళ రహదారి భద్రతపై అధికారులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి