Monday, November 2, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

రాత్రికి రాత్రే రెండు పురాతన ఆలయాల తొలగింపు!

40 ఏళ్లుగా పూజలు చేస్తున్న మల్లన్న, ఎల్లమ్మ ఆలయాలు నేలమట్టం.. విగ్రహాలను షెడ్డు కిందకు తరలించడంపై గ్రామస్థుల ఆగ్రహం
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
November 2, 2026 · 24 seconds క్రితం
◉ 1 Views ↗ 1 Shares

40 ఏళ్లుగా పూజలు చేస్తున్న మల్లన్న, ఎల్లమ్మ ఆలయాలు నేలమట్టం.. విగ్రహాలను షెడ్డు కిందకు తరలించడంపై గ్రామస్థుల ఆగ్రహం

ముప్పిరెడ్డిపల్లి
మనోహరాబాద్
నవంబర్ 2

గ్రామస్థుల ఆవేదన
40 ఏళ్లు
పూజలు నిర్వహిస్తున్న ఆలయాలతో గ్రామానికి అనుబంధం

మనోహరాబాద్, నవంబర్ 2 (నవజ్యోతి ప్రతినిధి నవీన్): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని మల్లన్న, ఎల్లమ్మ ఆలయాలను పరిశ్రమ యాజమాన్యం గ్రామస్థులకు సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రే తొలగించడంతో వివాదం చెలరేగింది. గత 40 ఏళ్లుగా గ్రామస్థులు, ఆలయ యాజమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఈ ఆలయాల భూమిని కొన్ని నెలల క్రితం టీజీఐఐసీ పరిశ్రమల కోసం సేకరించింది. తొలుత ఆలయాలను అలాగే ఉంచిన పరిశ్రమ యాజమాన్యం, విగ్రహాలను పక్కకు తరలించి మరోచోట ఆలయాలు నిర్మించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆదివారం ఉదయం గ్రామస్థులు వెళ్లి చూడగా రెండు ఆలయాలు నేలమట్టమై, విగ్రహాలను పరిశ్రమలోని ఓ మూలన ఏర్పాటు చేసిన షెడ్డు కింద ఉంచినట్లు గుర్తించారు. కొన్ని విగ్రహాలను గుంతలో వేసేందుకు ప్రయత్నించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

మల్లన్న
పురాతన ఆలయం
ఎల్లమ్మ
పురాతన ఆలయం

ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలయ యాజమానులు, గ్రామస్థులు

నాలుగు దశాబ్దాలుగా పూజలు నిర్వహిస్తున్న ఆలయాలను తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ఆలయ యాజమానులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలోని షెడ్డు కింద విగ్రహాలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు నిరసన వ్యక్తం చేస్తూ అధికారులు వెంటనే స్పందించి పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

యథాస్థితిలో ఆలయాలను పునర్నిర్మించాలి!
గతంలో ఆలయాలు ఎలా ఉన్నాయో అదే విధంగా గ్రామంలో తిరిగి నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

పరిశ్రమ గేటు ఎదుట ధర్నాకు హెచ్చరిక

ఆలయాల తొలగింపుపై అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఉన్న విధంగానే ఆలయాలను తిరిగి నిర్మించకపోతే గ్రామస్థులతో కలిసి పరిశ్రమ గేటు ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. దశాబ్దాలుగా గ్రామ ప్రజల ఆధ్యాత్మిక జీవితంలో భాగమైన ఆలయాల తొలగింపుపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

గ్రామస్థుల డిమాండ్ ఒక్కటే!
ఆలయాలను యథాస్థితిలో పునర్నిర్మించి న్యాయం చేయాలి

నవజ్యోతి తెలుగు డైలీ
ప్రజల పక్షం.. ప్రజా సమస్యలపై నిరంతర కథనం

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram