Monday, November 2, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
కామారెడ్డి

జంగంపల్లి రెవెన్యూ కార్యాలయానికి కొత్త రూపు!

మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి.. గ్రామాభివృద్ధికి సహకరిస్తామని హామీ
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
November 2, 2026 · 16 hours క్రితం
◉ 11 Views ↗ 0 Shares
Oplus_16908288

భిక్కనూరు, నవంబర్‌ 2 (నవజ్యోతి ప్రతినిధి): భిక్కనూరు మండలం జంగంపల్లిలోని రెవెన్యూ కార్యాలయ మరమ్మతు పనులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి శ్రీకారం చుట్టారు. ఆదివారం కార్యాలయానికి చేరుకున్న ఆమె రిబ్బన్‌ కట్‌ చేసి పనులను ప్రారంభించారు. తన కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం కార్యాలయ అభివృద్ధికి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు జంగంపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఐక్యతతో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీవాణి వాడు యాదవ్ ,  ఉపసర్పంచ్‌ ప్రకాష్‌గౌడ్‌, వార్డు సభ్యులు శ్రీనివాస్‌యాదవ్‌, బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్‌ సిద్ధిరాములు, గ్రామ బీజేపీ అధ్యక్షుడు ప్రవీణ్‌గౌడ్‌, నాయకులు మోహన్‌రెడ్డి, నారాయణరెడ్డి, పోచయ్య, వెంకట్‌, వాసు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram