Sunday, November 1, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
క్రైమ్

పైకప్పు రేకులు తొలగించి చోరీ! కొంపల్లిలో అర్ధరాత్రి అలజడి.. దుకాణంలో దొంగల బీభత్సం!

కుత్బుల్లాపూర్‌, అక్టోబర్‌ 25 (నవజ్యోతి ప్రతినిధి):
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 25, 2026 · 1 week క్రితం
◉ 72 Views ↗ 4 Shares
పంపుల దుకాణం టార్గెట్‌.. రూ.2 లక్షల నగదు స్వాహా
📍 కుత్బుల్లాపూర్‌
📅 అక్టోబర్‌ 25
🚔 పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌

కుత్బుల్లాపూర్‌, అక్టోబర్‌ 25 (నవజ్యోతి ప్రతినిధి): కొంపల్లిలో దొంగలు ఓ దుకాణాన్ని లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. పైకప్పు రేకులు తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు క్యాష్‌ కౌంటర్‌లోని సుమారు రూ.2 లక్షల నగదుతో పాటు కొన్ని పంపులను ఎత్తుకెళ్లారు. కొంపల్లిలోని శ్రీ సాయి దుర్గా పంప్స్‌ అండ్‌ బోర్‌వెల్‌ దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

దుకాణ యజమాని బండారి యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు పైకప్పు రేకులు తొలగించి లోపలికి చొరబడి నగదు, పంపులను అపహరించారు. ఘటనపై బాధితుడు పేట్‌ బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram