విజయదశమి వేళ ఏడుపాయల వనదుర్గమ్మ దర్శనానికి భక్తుల రాక
మెదక్, అక్టోబర్ 20 (నవజ్యోతి డెస్క్):
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 20, 2026 · 2 weeks క్రితం
◉ 49 Views↗ 1 Shares
శ్రీ రాజరాజేశ్వరి సహిత వనదుర్గాదేవి రూపంలో అమ్మవారు.. సాయంత్రం వరకు భక్తుల తాకిడి
మెదక్, అక్టోబర్ 20 (నవజ్యోతి డెస్క్): విజయదశమి పర్వదినం సందర్భంగా మెదక్ జిల్లా ఏడుపాయల శ్రీ వనదుర్గాభవాని అమ్మవారి క్షేత్రానికి మంగళవారం ఉదయం నుంచే భక్తులు తరలివస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వరి సహిత వనదుర్గాదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుండటంతో మెదక్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నవరాత్రుల సందర్భంగా భవానీ మాలలు ధరించిన భక్తులు అమ్మవారి సన్నిధిలో మొక్కులు తీర్చుకుని మాలల విరమణ చేస్తున్నారు. విజయదశమి సందర్భంగా ఉదయం నుంచే కొనసాగుతున్న భక్తుల రాక సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉండటంతో ఏడుపాయల క్షేత్రంలో రోజంతా ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి