భిక్కనూరులో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు !
వీధి వీధినా ఆధ్యాత్మిక శోభ !
◉ 10 Views
↗ 0 Shares
భిక్కనూరు, అక్టోబర్ 11 (నవజ్యోతి ప్రతినిధి): భిక్కనూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పట్టణంలోని పలు వీధుల్లో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడంతో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉత్సవాల నిర్వాహకులు మాలధారణ చేసి నవరాత్రి పూజల్లో పాల్గొంటున్నారు. అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠాపనతో వీధులన్నీ పండుగ శోభను సంతరించుకోగా, పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సెలవుల నేపథ్యంలో పలువురు తమ సొంత ఇళ్లకు, స్వగ్రామాలకు చేరుకోవడంతో పట్టణంలో సందడి, రద్దీ పెరిగింది. నవరాత్రి ఉత్సవాలతో భిక్కనూరు పట్టణ వీధులు భక్తులతో కళకళలాడుతున్నాయి.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి






