బాలా త్రిపుర సుందరి రూపంలో దర్శనమిచ్చిన మాతా భువనేశ్వరి
భిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
◉ 6 Views
↗ 1 Shares
భిక్కనూరు, అక్టోబర్ 11 (నవజ్యోతి ప్రతినిధి): భిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తి పారవశ్యంతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు మాతా భువనేశ్వరి అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారి దివ్య దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. దీంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి






