రాజకీయాలు.. ప్రజా కార్యక్రమాలు.. విద్యా రంగం.. ఇలా నిత్యం బిజీగా ఉండే మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి న్యూజిలాండ్ పర్యటనలో కాస్త భిన్నంగా కనిపించారు. ప్రకృతి అందాలకు పేరుగాంచిన క్వీన్స్‌టౌన్‌లో మంచు పర్వతాల మధ్య ప్రశాంతతను ఆస్వాదించారు.
తెల్లటి మంచు కొండల మధ్య పద్మాసనంలో కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేశారు. చుట్టూ గడ్డకట్టే చలి ఉన్నప్పటికీ నిశ్చలంగా మెడిటేషన్‌లో మునిగిపోయారు. మంచు పర్వతాల నడుమ ఆయన ధ్యానం చేస్తున్న దృశ్యాలు ఆకట్టుకున్నాయి.
“మనసుకు ప్రశాంతత ఇచ్చేది ధ్యానమే”
ఎన్ని పనులు, ఒత్తిళ్లు ఉన్నా మనసుకు ప్రశాంతత ఇచ్చేది ధ్యానమేనని మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రకృతి ఒడిలో ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతతతో పాటు శరీరానికి ఉత్సాహం లభిస్తుందని తెలిపారు.
రాజకీయ జీవితంలో నిరంతర బిజీకి కాసేపు విరామం ఇచ్చి.. మంచు పర్వతాల మధ్య మౌనాన్ని ఆస్వాదించిన మల్లారెడ్డి పర్యటనలో ఈ ధ్యాన ఘట్టం ప్రత్యేకంగా నిలిచింది.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి