లక్ష్మీదేవునిపల్లిలో నూతన యువజన కాంగ్రెస్ కమిటీ !
తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచనలతో, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో నూతన గ్రామ యువజన కాంగ్రెస్ కమిటీని ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షుడిగా ఆత్మకూరి అనిల్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మాగిని రమేష్, పుల్లూరి భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా అలకుంట శ్రీకాంత్, కార్యదర్శులుగా మాగిని నరేష్, పరికోత ప్రశాంత్ నియమితులయ్యారు. సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా అలకుంట మహేష్, సలహాదారుడిగా ఏనుగు మాధవ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, లింబారెడ్డి, రామ్‌రెడ్డి, నాగిరెడ్డి, మైపాల్ రెడ్డి, రమేష్, ఎల్లం, నర్సింలు, ఎం. నర్సింలు, పి. భూమయ్య పాల్గొని నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ.. నూతన కమిటీ సభ్యులు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామ సమస్యల పరిష్కారంలో యువత ముందుండాలని సూచించారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ గ్రామంలో పార్టీ అభివృద్ధికి శ్రమిస్తామని తెలిపారు.






