Sunday, November 1, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

మా గ్రామ అటవీ భూమిని రక్షించండి !

స్టీల్ పరిశ్రమపై రేంజ్ అధికారికి గ్రామస్థుల ఫిర్యాదు....
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
November 1, 2026 · 9 hours క్రితం
◉ 5 Views ↗ 0 Shares

మనోహరాబాద్, 31 అక్టోబర్ ( నవజ్యోతి ప్రతినిధి నవీన్ ) : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయవల్లి గ్రామ శివారులో ఉన్న ఎంఎస్ అగ ర్వాల్ స్టీల్ పరిశ్రమపై గ్రామ పలువురు పాలకవర్గo సభ్యులు శనివారం అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. పరిశ్రమ నిర్మాణం చేపట్టే క్రమంలో కొంత అటవీ భూమిని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించారని వారు ఆరోపించారు. అంతేకాకుండా పరిశ్రమ నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి కారణంగా పరిసర ప్రాంతాల్లోని చెట్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, అవి క్రమంగా చనిపోతున్నాయని అధికారుల దృష్టికి తీసు కెళ్లారు. అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత అధికారు లపై ఉందని పేర్కొన్నారు. అటవీ భూమి ఆక్రమణ ఆరోపణ పై సమగ్ర విచారణ చేపట్టి, పర్యావరణానికి నష్టం కలి గిస్తున్న పరిశ్రమపై తగిన చర్యలు తీసుకోవాలని అటవీ రేంజ్ అధికారి అంబర్ సింగ్ కు శనివారం వినతిత్రం అందజే శారు. పరిశ్రమ వల్ల అటవీ ప్రాంతానికి జరుగుతున్న నష్టాన్ని రక్షించాలని గ్రామ పాల కవర్గ సభ్యులు బాబు, తో పాటు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram