Sunday, November 1, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నిజామాబాద్

సీఎంఆర్ అక్రమాలపై సర్కార్ కొరడా.. నిజామాబాద్ డీసీఎస్ఓ సస్పెండ్!

ఆరుగురు మిల్లర్లపై కేసులు.. కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సీరియస్
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 31, 2026 · 19 hours క్రితం
◉ 27 Views ↗ 2 Shares

నిజామాబాద్, అక్టోబర్ 31 (నవజ్యోతి డెస్క్): విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీసీఎస్ఓ) శ్రీకాంత్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. జిల్లాలో రైస్ మిల్లుల నెలవారీ తనిఖీలు నిర్వహించకపోవడం, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారంలో అలసత్వం వహించినట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు. జిల్లాలో రైస్ మిల్లుల తనిఖీల్లో లెక్కల్లో తేడాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూడగా ఆరుగురు మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వానికి అందించాల్సిన సీఎంఆర్ బియ్యం విషయంలోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సీఎంఆర్ బకాయిలపై నిర్లక్ష్యం
ప్రభుత్వ ధాన్యం తీసుకుని బియ్యం తిరిగి అప్పగించకుండా బకాయిలు పేరుకుపోయినా, మిల్లర్ల నుంచి రికవరీ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

బకాయిల వసూలుకు డిమాండ్ నోటీసులు జారీ చేసి, నిర్ణీత గడువులో చెల్లించకపోతే మిల్లర్ల ఆస్తులను జప్తు చేయాల్సి ఉన్నప్పటికీ కొన్నిచోట్ల సంవత్సరాలు గడుస్తున్నా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేసులు నమోదైనా బకాయిలు వసూలు కాకపోవడంతో డీఫాల్టర్ల సంఖ్య పెరుగుతోందని, అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెలవారీ తనిఖీలను నిర్లక్ష్యం చేసిన డీసీఎస్ఓపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరిక
విధుల్లో అలసత్వం వహించే అధికారులను ఉపేక్షించేది లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. సీఎంఆర్ బకాయిల వసూలు, రైస్ మిల్లుల తనిఖీల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో కీలక అంశాలు
01
డీసీఎస్ఓ సస్పెన్షన్
06
మిల్లర్లపై కేసులు
నవజ్యోతి తెలుగు డైలీ
ప్రజల పక్షం.. ప్రజా సమస్యలపై నిరంతర కథనం
ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram