Tuesday, November 3, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
క్రైమ్

అర్ధరాత్రి హల్‌చల్‌ ! తూప్రాన్‌లో రెచ్చిపోయిన దొంగలు.. రెండు షాపుల్లో చోరీ

రూ.50 వేల నగదు, సామాగ్రి అపహరణ.. సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ కూడా మాయం
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
September 24, 2026 · 1 month క్రితం
◉ 58 Views ↗ 1 Shares

తూప్రాన్‌, సెప్టెంబర్‌ 24 (నవజ్యోతి ప్రతినిధి నవీన్‌):


మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణంలో గుర్తుతెలియని దొంగలు హల్‌చల్‌ చేశారు. నర్సాపూర్‌ చౌరస్తా సమీపంలోని రెండు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. ఒక దుకాణంలోని నగదుతో పాటు సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను ఎత్తుకెళ్లగా.. మరో షాపు తాళాలు పగలగొట్టి బైక్‌ ఇంజన్‌ సామగ్రిని అపహరించినట్లు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నర్సాపూర్‌ చౌరస్తా వద్ద రహదారి పక్కన ఉన్న శబరి సూపర్‌ మార్కెట్‌లో క్యాష్‌ కౌంటర్‌లో ఉంచిన సుమారు రూ.50 వేల నగదును దొంగలు అపహరించినట్లు యజమానులు తెలిపారు. అంతేకాకుండా దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను సైతం తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం పక్కనే ఉన్న ఇంద్ర మోటార్స్‌ మెకానిక్‌ షాపుపై కూడా దొంగలు కన్నేశారు. షాపు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బైక్‌ ఇంజన్‌కు సంబంధించిన సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రెండు దుకాణాల యజమానుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తూప్రాన్‌ ఎస్‌ఐ గంగరాజు తెలిపారు. చోరీ జరిగిన ప్రాంతంలోని ఇతర సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ దొంగల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram