జమ్మూ-కశ్మీర్‌పై ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) కాంటాక్ట్ గ్రూప్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో భారత్‌పై చేసిన ప్రస్తావనలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. అవి అనవసరమైనవి, వాస్తవాలకు విరుద్ధమైనవని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) స్పష్టం చేసింది.
జమ్మూ-కశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగాలని ఎంఈఏ పునరుద్ఘాటించింది. భారత్‌కు సంబంధించిన అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే అధికారం ఓఐసీకి లేదని పేర్కొంది. రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలతో వాస్తవ పరిస్థితిని మార్చలేరని స్పష్టం చేసింది. 0
ఓఐసీపై భారత్ ఏమన్నదంటే..
జమ్మూ-కశ్మీర్‌పై ఒకే తరహా కథనాలను పదేపదే సమర్థించడం ద్వారా ఓఐసీ తన విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తేలా చేసుకుంటోందని ఎంఈఏ పేర్కొంది.
పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ న్యూయార్క్‌లో జరిగిన ఓఐసీ కాంటాక్ట్ గ్రూప్ సమావేశంలో జమ్మూ-కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో భారత్ స్పందించింది. ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్‌పై ఓఐసీ దేశాలు ఏకీకృత వైఖరిని కొనసాగించాలని దార్ కోరినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. 1
జమ్మూ-కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా పరిష్కరించాలని, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని దార్ కోరారు. 2019 తర్వాత భారత్ తీసుకున్న చర్యలను వెనక్కి తీసుకోవాలని కూడా ఓఐసీని కోరినట్లు పాకిస్థాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. 2
పాకిస్థాన్‌కు వేదిక కల్పించడం కంటే.. ఉగ్రవాదంపై దృష్టి పెట్టాలని ఓఐసీకి ఎంఈఏ సూచించింది. పాకిస్థాన్ భూభాగం నుంచి ఉగ్రవాద ముప్పు కొనసాగుతోందని భారత్ పేర్కొంటూ, ఆ సమస్యను పరిష్కరించేందుకు పాకిస్థాన్‌కు సూచనలు చేయాలని కోరింది. 3